ఈనెల 26న తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు
పద్మశాలి ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలి– *అనంతుల లక్ష్మీనారాయణ.
పాల్వంచ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS) అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈనెల 26న హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో గల స్వకులశాలి సమాజ భవనంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు అనంతుల లక్ష్మీనారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ఉద్యోగుల సంక్షేమం, పద్మశాలి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, సంఘం భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలి ఉద్యోగులు ఒకే వేదికపై సమావేశమై పరస్పర అవగాహన పెంపొందించుకోవడంతో పాటు సంఘ బలోపేతానికి ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని పద్మశాలి ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దూలం నటరాజ్, గొట్టిముక్కుల మహేందర్, పసునూతి వెంకటేశ్వర్లు, కొండి పద్మజ, పుట్ట లింగమూర్తి, దిగిదారి రాము తదితరులు పాల్గొన్నారు.






