31 May, 2026 | 2:37 AM

సందేశమిచ్చే నేనెవరు?

31-05-2026 01:39 AM

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర లో సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో యువ దర్శకుడు చిరంజీవి తన్నీరు రూపొందించిన సం దేశాత్మక చిత్రం ‘నేనెవరు?’. అండేకర్ జగదీశ్‌బాబు, సకినాన భూలక్ష్మి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా మే 29న విడుదలైంది. ప్రేక్షకుల నుం చి వస్తున్న పాజిటివ్ టాక్‌తో మరిన్ని కేంద్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్ర సాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తుండటం సంతోషకరమన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ; సినిమాటోగ్రఫీ: నాయుడు ప్రసాద్ కొల్లి; ఎడిటింగ్: నందమూరి హరి - తారకరామారావు.