13 August, 2026 | 3:45 AM

ఉత్తర తెలంగాణలో పెరుగుతున్న మూత్రపిండ వ్యాధి

13-08-2026 01:22 AM

ముకరంపుర, ఆగస్టు 12(విజయ క్రాంతి) ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉధృతిని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్స్ నిపుణులు కరీంనగర్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ప్రముఖ నెఫ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ అరుణ్ పొన్న మరియు హై-రిస్క్ మార్పిడి నుండి కోలుకున్న పేషెంట్ రాజకుమార్ తో కలిసి నిర్వహించిన ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ అరుణ్ పొన్న మాట్లాడుతూ తీవ్రమైన, బహుళ సమస్యలతో చివరి దశలో ఆసుపత్రికి రావడం అనేది మంచిది కాదని సాధారణ ఆరోగ్య తనిఖీల ద్వారా సులభంగా నివారించవచ్చు అని అంతేకాకుండా, కిడ్నీ మార్పిడి చుట్టూ విస్తృతమైన భయం,

అవగాహన లోపం ఉందన్నారు. కుటుంబంలో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే లేదా సంక్లిష్టమైన వైద్య చరిత్ర ఉంటే మార్పిడి అసాధ్యమని భావిస్తారు కానీ  స్వాప్ మార్పిడిలో వచ్చిన ఆధునిక పురోగతులతో, బ్లడ్ గ్రూప్ అడ్డంకులు ఇకపై పేషెంట్లకు ప్రాణాలను రక్షించే వైద్యం అందకుండా ఆపలేవు అన్నారు.డాక్టర్ అరుణ్ పొన్న పర్యవేక్షణలో విజయవంతంగా హై-రిస్క్ కిడ్నీ మార్పిడిని పొందిన పేషెంట్ రాజు మాట్లాడుతూక్లిష్ట పరిస్థితుల్లో కూడా కిడ్నీ మార్పిడి సాధారణ జీవితాన్ని పునరుద్ధరించ గలదని చెప్పడానికి నేనే సజీవ సాక్ష్యం అన్నారు.