20 March, 2026 | 10:08 AM

బియ్యం దొంగ అరెస్టు

20-03-2026 12:25 AM
  1. మహారాష్ట్రలో పోలీసులకు చిక్కిన డీటీపీ ఆపరేటర్ ప్రదీప్
  2. కామారెడ్డి జిల్లాలో 667 టన్నుల బియ్యం మిల్లర్లకు సరఫరా 
  3. ఆపరేటర్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు?
  4. రూ.2.40 కోట్ల కుంభకోణానికి బాధ్యులెవరు!

కామారెడ్డి, మార్చి 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో జరిగిన రూ.2.40 కోట్ల  బియ్యం కుంభకోణంలో నిందితుడైన డీటీపీ ఆపరేటర్ ప్రదీప్‌ను ఏసీబీ అధికారులు గురువారం మహారాష్ట్రలో అదుపు లోకి తీసుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకుని రాబియ్యం ప్రభుత్వానికి అప్పగిస్తామని రైస్ మిల్లర్లు కొందరు రూ.2.40 కోట్ల విలువైన 667 టన్నుల బియ్యం మూడు గో దాముల నుంచి కొల్లగొట్టారు.

కొల్లగొట్టిన రైస్ మిల్లర్లకు సివిల్ సప్లై కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న డీటీపీ ఆపరేటర్ ప్రదీప్ సహకరించారని ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. ఏసీబీ అధికారులు కామారెడ్డి కలెక్టరేట్‌లోని సివిల్ సప్లై కా ర్యాలయంలో దాడులు నిర్వహించి ఫైళ్లను, కంప్యూటర్‌లో నమోదైన వివరాలను పరిశీలించి అసలు దొంగ ప్రదీప్‌గా గుర్తించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రదీప్‌ను పోలీసులు గురువారం మహారాష్ట్రలో అరెస్టు చేశారు.

ఇన్నేళ్లుగా నానుతున్న రూ.2.40 కోట్ల విలువగల 667 మెట్రిక్ టన్నుల బియ్యం కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ప్రభుత్వానికి రావాల్సిన బియ్యాన్ని రైస్ మిల్లర్లు అప్పగించకపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో కొంతమంది రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన రా రైస్ అప్పగించకపోవడంతో కోట్ల విలువ చేసే బియ్యం ప్రభుత్వానికి చేరలేదు.

ఏసీబీ అధికారుల విచారణలో రూ.200 కోట్లకు పైగా బి య్యం ప్రభుత్వానికి రావాల్సి ఉందని తేల్చారు. సివిల్ సప్లై కార్యాలయంలో పనిచేసే అవుట్‌సోర్సింగ్ డీటీపీ ఆపరేట్ రైస్ మిల్లర్లతో కు మ్మక్కై ఫేక్ ఐడీలు సృష్టించి వడ్లను రైస్ మిల్లులకు తరలించారని ఏసీ బీ అధికారుల విచారణలో తేలింది.