సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
టేకులపల్లి, (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.23.35 లక్షల విలువైన చెక్కులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు ఎక్స్ రోడ్డు రైతు వేదికలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 83 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు పొందుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడు తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






