calender_icon.png 13 February, 2026 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ బకాయిలతో రైస్ మిల్ సీజ్

13-02-2026 01:31:41 PM

ఆందోళనలో రైతులు

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో సంతోష్ మాత రైస్ మిల్ ని కేంద్ర జిఎస్టి అధికారులు గురువారం సీజ్ చేసి ప్రాంగణం వెలపల నోటీసులు అంటించారు.2017 నుంచి 2022 వరకు 1.81 కోట్ల జిఎస్టి బకాయిలు చెల్లించకపోవడంతో చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.గతంలో సీఎంఆర్ చెల్లింపుల విషయంలో కేసు నమోదు కాగా రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు కోట్ల రూపాయలు బాకీ ఉన్నట్లు సమాచారం.మిల్లును సీజ్ చేయడం పట్ల రైతుల బకాయిలు ఎలా వసూలు అయితాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు