2 July, 2026 | 6:42 PM

సర్ పై గ్రామస్తులకు అవగాహన

02-07-2026 05:44 PM

భైంసా ( విజయక్రాంతి) : భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న సర్ ఓటర్ విధానంపై గురువారం కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో అవగాహన కల్పించారు. సర్ ఓటర్ నమోదు ప్రక్రియను ఆన్లైన్ విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించినట్లు స్థానిక సర్పంచ్ కట్ట రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు ప్రభాకర్. ప్రత్యేక పరిశీలకులు అశోక్ కేశెట్టి వర్క్ గ్రామస్తులు పాల్గొన్నారు.