2 July, 2026 | 6:54 PM

మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ గా మోటూరి శ్రీకాంత్

02-07-2026 05:48 PM

కామారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి  ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణానికి చెందిన 16 మంది బీజేపీ కౌన్సిలర్ లు బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం జిల్లా బిజెపి అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అద్యక్షతన సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో బిజెపి కౌన్సిలర్లు 39 వ వార్డు  కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ లో బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా మోటురీ శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా రెండవ సారి అవకాశం ఇచ్చిన  కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కి, తోటి కౌన్సిలర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు మున్సిపల్ లో ప్రజల పక్షాన , కామారెడ్డి పట్టణ అబివృద్ధి కి , సమస్యల పరిష్కారం కోసం గళం విప్పుతానని శ్రీకాంత్ అన్నారు. భారతీయ జనతా పార్టీ పటిష్టతకు తోటి కౌన్సిలర్ లతో కలిసి బూత్ స్థాయిలో పని చేస్తానని, పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తానని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి ఫ్లోర్ లీడర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీకాంత్ బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, బిజెపి కౌన్సిలర్లు అభినందించారు.