2 July, 2026 | 6:59 PM

శ్రీవారి సేవలో ఎస్ జె కె ఎమ్ కళాశాల విద్యార్థులు

02-07-2026 06:00 PM

ఎర్రుపాలెం జూలై 2 (విజయ క్రాంతి): తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం ఆలయ సన్నిధిలో గురువారం నాడు నిర్వహించిన ధ్వజ ఆరోహణ కార్యక్రమము ,మహానదాన కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమంలో సేవను అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కళాశాల యాజమాన్యాన్ని మరియు విద్యార్థులను గ్రామ సర్పంచ్ తుళ్లూరు నిర్మల కుమారి  వకుల మత స్టేడియం నిర్మాణదాత తుళ్లూరు కోటేశ్వర రావు  అభినందించారు . ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని సేవలందించిన విద్యార్థులను డైరెక్టర్  దండం సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ నాగిరెడ్డి సౌజన్య అభినందించారు.