2 July, 2026 | 6:59 PM

సుల్తానాబాద్ పాఠశాలను ఎంఈవో ఆకస్మికంగా తనిఖీ

02-07-2026 05:55 PM

సిర్గాపూర్ జులై 02(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని సుల్తానాబాద్ (నల్లవాగు) MPUPS పాఠశాలను  మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) నాగారం శ్రీనివాస్ పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, తరగతి గదుల నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో పరిశుభ్రతను పాటిస్తూ, విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. అలాగే విద్యార్థుల అభ్యాస ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.