TRS నాయకుల ముందస్తు అరెస్టులు
దమ్మపేట, జూలై 02(విజయ క్రాంతి): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపుమేరకు గురువారం ఉప్పల్ భగాయత్‌లో జరుగుతున్న తెలంగాణ ఉద్యమకారుల భూ హక్కుల పోరాటానికి తరలివెళుతున్న అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ సోడెం వెంకట్‌ను దమ్మపేట పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సోడెం వెంకట్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులపై కోసం పోరాడుతున్న తమను అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రజల కోసం, పేదల భూ హక్కుల కోసం పోరాడుతున్న నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా ఉద్యమ స్ఫూర్తిని అణచివేయలేరన్నారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ముందస్తు అరెస్టులు, పోలీసు నిర్బంధాలతో భూ హక్కుల ఉద్యమాన్ని ఆపడం ఎవరి వల్లా సాధ్యం కాదని, భూమి కోసం, హక్కుల కోసం, తెలంగాణ ఉద్యమకారుల పోరాటం నిరంతరం కొనసాగుతుందని అన్నారు.






