6 May, 2026 | 8:35 PM

గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి

06-05-2026 07:37 PM

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు..

ఉట్నూర్,(విజయక్రాంతి): సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ పరిధిలోని గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. బుధవారం కొమురం భీం కాంప్లెక్స్‌లోని పిఎంఆర్సిలో గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజన సహకార సంస్థ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న సహకార సంస్థ కార్యక్రమాలు లక్ష్యాలను  సాధించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

గిరిజనుల జీవనోపాధి మెరుగుపరిచే దిశగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్సే కరణ, కొనుగోలు, నిల్వ, మార్కెటింగ్ అంశాలలో పారదర్శకత పాటించాలని, గిరిజనులకు న్యాయమైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని, మధ్యవర్తుల జోక్యాన్ని పూర్తిగా నివారించాలని తెలిపారు. గిరిజన సహకార సంస్థ ద్వారా అందిస్తున్న సేవలు ప్రతి గ్రామానికి చేరేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వివరించాలని తెలిపారు.

వన ఉత్పత్తుల విలువ, ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని తెలిపారు. సమీక్షలో భాగంగా అధికారులు తమ పరిధిలో చేపట్టిన పనుల పురోగతిని వివరించి, పనుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకురాగా ప్రాజెక్టు అధికారి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లక్ష్య సాధనలో నిర్లక్ష్యం, అలసత్వం వహించే అధికారులపై చర్యలు  తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.