13 August, 2026 | 3:08 AM

మియాపూర్‌లో వన్డే వన్ వార్డ్‌పై సమీక్ష

13-08-2026 01:51 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (విజయక్రాం తి): మియాపూర్ డివిజన్ పరిధిలోని డీకే ఎ న్క్లేవ్ కాలనీలో వన్డే వన్వార్డ్ కార్యక్రమంలో భాగంగా సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ కార్యక్రమం పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన ఐఏఎస్, జోనల్ కమిషనర్ నారాయణ్ అ మిత్, డీసీ శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. కాలనీ సమస్యలు,

భివృద్ధి పనులపై చర్చించిన పీఏసీ చైర్మన్ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీరు వంటి మౌలిక వసతులు త్వరగా అందించాలని, పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్కుల అభివృద్ధి, నాలల విస్తరణ, సీసీ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.