16 June, 2026 | 9:53 PM

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న రేవంత్ ప్రభుత్వం

16-06-2026 08:35 PM

 విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలనే కూల్చేస్తారు

విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తే ఊరుకునేది లేదు

భూపతి శ్రీనివాసరావు

కొత్తగూడెం,(విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా రాష్ట్రంలోని లక్షలాది మంది, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ జిల్లా నాయకులు భూపతి శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ... డిగ్రీ, పీజీ విద్య పూర్తి చేసినప్పటికీ ఫీజు బకాయిల కారణంగా అనేక కళాశాలలు విద్యార్థులకు, సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను సతాయిస్తున్నారు.  ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

 విద్యార్థులతో పెట్టుకుంటే రేవంత్ ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందని, విద్యార్థుల ఓపికను పరీక్షించొద్దని, ఎంతోమంది నిరుపేద విద్యార్థులు వారి భవిష్యత్తును రోడ్లపాలు చేయొద్దని భూపతి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం సొంత ఇంటి నిర్మాణం కొరకు ధనాన్ని సమకూర్చుకోవచ్చు,కానీ విద్యార్థుల స్కాలర్షిప్ కొరకు మాత్రం ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం  విడ్డూరమని బీసీ సెల్ నాయకుడు శ్రీనివాస్ ఆరోపించారు.

బీఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో కరోనా, నోట్ల రద్దు వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సుమారు రూ.19,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించామని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు సమీపిస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు.

వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని భూపతి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.