పదవీ విరమణ చేసిన సేఫ్టీ ఆఫీసర్ భూశంకరయ్య జీఎం రాధాకృష్ణ వీడ్కోలు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణి మందమర్రి ఏరియాలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌గా సుదీర్ఘ కాలం సేవలందించిన భూశంకరయ్య మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ హాజరై, భూశంకరయ్య దంపతులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జీ.ఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ... భూశంకరయ్య తన సుదీర్ఘ సర్వీసులో సంస్థ అభివృద్ధికి, ముఖ్యంగా గనుల్లో భద్రతా ప్రమాణాల పెంపునకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. నిబద్ధతతో పనిచేసే అధికారుల వల్లనే సింగరేణి సంస్థ విజయవంతంగా నడుస్తోందని, ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జి.ఎం సేఫ్టీ రఘుకుమార్, (SO to GM) జి.ఎల్. ప్రసాద్, డి.జి.ఎమ్ (పర్సనల్) అశోక్ మాట్లాడుతూ... భూశంకరయ్యతో తమకున్న పని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
విధి నిర్వహణలో ఆయన కనబరిచిన చొరవ అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం భూశంకరయ్య మాట్లాడుతూ, తన ఉద్యోగ ప్రస్థానంలో సహకరించిన అధికారులకు, తోటి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జి.ఎం జి.ఎల్ ప్రసాద్, డీజీఎం పర్సనల్ అశోక్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ, అన్ని డిపార్ట్మెంట్ల హెచ్.ఓ.డిలు, జి.ఎమ్ కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొని ఆయనకు వీడ్కోలు పలికారు.




