చిన్న ఉద్యోగులపై కక్ష సాధింపు ఎందుకు
13-04-2026 08:19 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బంగల్పేట చెందిన ఆర్పి కే సంధ్యారాణి గత ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించలేదన్న ఉద్దేశంతో తనను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల నుంచి తాను ఆర్పి గా పనిచేస్తున్నానని సంగతి తీర్మానం లేకుండా కొందరు నాయకులు తనపై కక్ష కట్టి ఆర్పి నుంచి తొలగించారని తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను వేరే పార్టీలో పనిచేసినట్టు చేస్తున్న ఆరోపణలు నిజం లేదని అన్నారు. ఈ విషయమని జిల్లా కలెక్టర్కు విన్నవించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాల సభ్యులు సంఘీభావం తెలిపారు.




