13 April, 2026 | 9:49 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

13-04-2026 08:21 PM

తుంగతుర్తి(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని పసునూరు ఈటూరు మామిడిపల్లి గ్రామాలలో ఐకెపి, పస్తాల గ్రామంలో పిఎసిఎస్  దాన్యం కొనుగోలు కేంద్రాలను , తుంగతుర్తి మండల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభించి మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారుల చేతుల్లో పోసి మోసపోవద్దని అన్నారు. రైతు పండించిన ప్రతి దాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ధాన్యం విక్రయాలలో నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందుకోవాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.

 ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పసునూరు గ్రామ సర్పంచ్ కమటం సునిత శ్రీనివాస్ పస్తాల గ్రామ సర్పంచ్ బుక్క శ్రీనివాస్ మామిడిపల్లి గ్రామ సర్పంచ్ అంబటి శ్రీను ఈటూరు గ్రామ సర్పంచ్ వంగూరు దామోదర్, కోరి కొప్పుల  నరేష్ గౌడ్ అశ్విని రెడ్డి కుంచాల శ్రీనివాసరెడ్డి మంజుల వెంకన్న, పసునూరు వివోఏ స్వరూప ఈటూరు వివోఏ వీరబోయిన ఉమా కార్యదర్శి వీరబోయిన శ్రీలత ఉపసర్పంచ్ నంగునూరు మంజుల, మామిడిపల్లి వివోఏ పిఎసిఎస్ సీఈవో యాదగిరి, ఎంఎసిఎస్ అధ్యక్షులు కడారి వీరస్వామి ఆయా గ్రామాల వివోఏలు సంఘ బంధం లీడర్లు నాయకులు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.