14 July, 2026 | 6:54 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

సోషల్ మీడియాపై ఆంక్షలు అవసరం!

07-02-2026 12:00 AM

నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులు సోషల్ మీడియా మాయాజాలంలో చిక్కుకుని తమ అమూల్యమైన బాల్యాన్ని, మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఈ భయంకరమైన పరిస్థితిని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా చారిత్రాత్మక చట్టాన్ని తీసుకురావాలని యోచిం చడం హర్షనీయం. ఈ నిర్ణయం కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుం డా, మన తెలంగాణలోనూ తక్షణమే అమలు చేయాల్సిన అవసరముంది.

తెలంగాణ సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా ఉండటంతో ఇక్కడ స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిపోయింది. ఏపీ తరహాలో మన రాష్ట్రంలోనూ 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించే చట్టాన్ని తీసుకురావాలి. చట్టపరమైన ఆంక్షలు అమలు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను సైబర్ నిపుణుల సలహాలతో అధిగమించాలి. కేవలం నిషేధంతోనే సరిపెట్టకుండా, పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ అక్షరాస్యతను బోధించాలి. సోషల్ మీడియాకు ప్రత్యామ్నాయంగా ఆటస్థలాలు, గ్రంథాలయాల వైపు పిల్లలను మళ్లించాలి. రెండు రాష్ట్రాలు ఒకే విధమైన విధానాన్ని రూపొందిస్తే, అది దేశవ్యాప్తంగా ఒక గొప్ప సంస్కరణకు నాంది పలుకుతుంది.

భూమేష్, నల్లగొండ