calender_icon.png 10 February, 2026 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలమైన చట్టాలు అవసరం!

06-02-2026 12:00:00 AM

పుల్లెంల గణేష్ :

భారతీయ జానాభాలో దాదాపు 85 శాతం హిందువులే ఉంటా రు. అయితే హిందూ వ్యవస్థలోని కులం కారణంగా అనేక అసమానతలు కలిగి మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ముసాయిదా కమిటీ సభ్యుల చేత భారత పార్లమెంటులో చట్టం ద్వారా ఆమోదించుకొని, ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా నూతన యూ జీసీ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.

అయితే ఈ నూతన యూజీసీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాల యాల్లో ఉన్న అగ్రకుల విద్యార్థులు, ప్రొఫెసర్లు నిరసనలు చేపట్టారు. విలిత్ జిందాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో నూతన యూజీసీ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 29న విచారణకు వచ్చిన ఈ కేసులో స్టే విధించిన సుప్రీంకోర్టు.. నేటి ఆధునిక సమాజంలో ఇంకా కుల అసమానతలు ఉన్నాయా? ఉన్నత చదువులు అభ్య సించే విశ్వవిద్యాలయాల్లో ఇలాంటివి జరుగుతున్నాయా? అని ప్రశ్నించింది.

ఒక్క కులం మూలంగానే వివక్షతలకు గురయ్యి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అని అనుమానం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఒక కులం కారణంగానే విశ్వవిద్యాలయాల్లో వివక్షలు కొనసా గుతున్నాయని చెప్పకుండా ప్రాంతీయ అసమానతలు, ర్యాగింగ్ తదితర ఇతర ము ఖ్యమైన అంశాలు చేర్చకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాం త్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీల ధర్మాసనం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కేసు తదుపరి విచారణను మార్చి 19న జరుపుతామని వెల్లడించింది.  కులం పేరుతో అసమానతలు జరుగుతున్నాయని ఎలాంటి బలమైన ఆధారాలు లేకుండా చట్టాలు చేస్తే సమాజం చీలిపోతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి తీర్పు వచ్చే వరకు పార్లమెంటు నూతన యూజీసీ చట్టాన్ని చేయకూడదని, నూతన నిబంధనలు ఆపేయాలని పేర్కొంది.

కొత్త చట్టానికి కారణాలు..

కేంద్ర ప్రభుత్వం యూజీసీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం వెనుక కారణాలను విశ్లేషించాల్సిన అవసరముంది. దేశంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కుల అసమానత, వివక్షకు లోనయ్యి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని రూపుమాపి సామాజిక న్యాయం అందించడం కేంద్ర ప్రభుత్వం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసింది.

ఇక భారత రాజ్యాంగబద్ధ సంస్థగా స్వయం ప్రతిపత్తి కలిగిన యూజీసీ ఉన్నత అధికారుల బృందం 2019 నుంచి 2024 వరకు ఐదు సంవత్సరాల కాలాన్ని ఒక ప్రామాణికంగా చేసుకొని దేశంలోని దాదాపుగా 700 యూనివర్సిటీల్లో, 15 వేల కాలేజీల్లో సర్వే చేసి దాదాపు 118 శాతం కుల అసమానతలు ఉన్నాయని తేల్చిచెప్పింది. యూజీసీ సర్వే ప్రకారం ఈ ఆధునిక సమాజంలో రాజ్యాంగం అమలవుతున్నప్పటికీ కులం తన రూపాన్ని మార్చు కొని గుణాన్ని కోల్పోకుండా ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నది.

అందుకే విశ్వ విద్యాలయాల్లో జరిగే కుల వివక్షతను రూపుమా పడానికి యూజీసీ అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా యూనివర్సిటీల్లో సమానత్వం కమిటీల పేరుతో ఏర్పాటయ్యే వీటిలో కుల వివ క్షతకు తావు లేకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ, మహిళా విద్యార్థులు ఒకే కూటమిగా ఉంటారు. ముఖ్యంగా కుల వివక్షకు గురయ్యే బాధితులకు న్యాయం జరిగేలా యూజీసీ కొత్త నిబంధనలను ప్రతిపాదించడం జరిగింది. 

మెజార్టీ వాటా వాళ్లదే..

విశ్వవిద్యాలయాల్లోనే కాదు, సమాజంలో కూడా అంటరానితనానికి, కుల వివ క్షతలకు గురై అగ్ర కులాల అవహేళన మూ లంగా అట్టడుగుల కులాల వ్యక్తులు చనిపోతుండడం సహజంగా కనిపిస్తుంది. కుల వివక్షతకు గురయ్యి 2019లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో మాల సామాజిక వర్గానికి చెందిన రోహిత్ వేముల, పాయల్ తద్వి ఆత్మహత్య చేసుకున్నారు.

వీరి తల్లిదండ్రులు వారి బిడ్డలకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదన్న ఉద్దేశంతో ఇక కుల వివక్షకు కారణ మైన నిందితులకు కఠిన శిక్ష పడేలా బలమైన చట్టాలు తీసుకొచ్చేలా సుప్రీంకోర్టులో కేసులు వేయడం స్వాగతించాల్సిన అంశం. కానీ సమాజంలో కులం తన ప్రభావాన్ని, కుల ఆధిపత్యాన్ని ఎంతగా చూపిస్తుందో ప్రత్యక్షంగా రుజువు చేయడానికి సాక్షాలు కనిపించవు.

ఎందుకంటే సుప్రీంకోర్టులోను, వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లోనూ సామాజికంగా, రాజకీయంగా ఆదిపత్యం చెలాయి స్తున్న వారిలో అగ్రకులాల వారే అధికంగా ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తుల్లోనూ ఈ వివక్ష కొనసాగుతున్న సందర్భాలు ఉన్నా యి. ఇక దేశంలోని అన్ని విశ్వవిద్యాలయా ల్లో అగ్రకులాల ప్రొఫెసర్లే  ఉన్నత స్థానాల్లో ఉండడం వల్ల సామాజిక న్యాయం లేక ప్రొ ఫెసర్ల భర్తీ నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. 

చట్టం దుర్వినియోగం!

దేశంలో ఇన్నాళ్లు కేంద్రంలో బీజేపీ ప్ర భుత్వాన్ని సమర్థించిన అగ్రకుల నాయకులు రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడల్లా మైనార్టీలను సాకుగా చూపి సమాజంలో జనాభా దామాషా ప్రకారం మెజార్టీగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం జరగకుండా అడ్డుపడుతూ వస్తున్నారు. ఇవాళ  కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న యూజీసీ చట్టాన్ని అదే రకంగా అడ్డుపడడం చూస్తుం టే అగ్రకులాలు కుల వివక్షతను సమర్థిస్తున్నట్లే కదా! అయితే ఇక్కడ అగ్రకుల విద్యా ర్థులు అభిప్రాయం ఏంటంటే..

ఒకవేళ కేం ద్ర ప్రభుత్వం నూతన యూజీసీ చట్టం తీసుకొస్తే సామాజిక వర్గాల విద్యార్థులు ఆ చట్టాన్ని తప్పుగా ఉపయోగించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దీని కి సమాజంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అత్యల్ప శాతం నిరుపయోగం అవుతుందనే విషయాన్ని సాకుగా చూపిస్తున్నారు. కానీ కేంద్ర తీసుకొస్తున్న యూజీసీ నూతన చట్టం కేవలం చట్టాన్ని తప్పుగా ఉపయోగించినప్పుడు బాధితులకు న్యాయం జరిగేలా, నిం దితులకు శిక్ష పడేలా చేయడమే ముఖ్య ఉద్దేశం.

సమాన హక్కులు..

2014లో మోదీ పధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ తమ సిద్ధాం తాన్ని ఆధునికరించుకొని ప్రజాస్వామ్య విలువల వైపు అనివార్యంగా ప్రయాణం చేస్తున్నది. అందులో భాగంగానే సామాజిక న్యాయానికి కట్టుబడి ఎస్సీ కులానికి చెందిన రామ్ నాథ్ కోవింద్, ఎస్టీ కులానికి చెందిన ద్రౌపది మూర్ములను రాష్ట్రపతులుగా నియమించడం, వివిధ బీజేపీ పాలిత రాష్ట్రా ల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఉన్న సామాజిక రాజకీయ చైతన్యాన్ని బట్టి అట్టడుగు కులాల వ్యక్తులనే ముఖ్యమంత్రులుగా చేస్తూ వస్తున్నది.

ఈ నేపథ్యంలోనే  నేడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం యూనివర్సిటీల్లో జరిగే కుల అసమానతలను, కుల వివక్షతలని రూపుమాపడానికి నూతన యూజీసీ చట్టా న్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. దీని పై మెజార్టీ ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. సామాజిక న్యాయం కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా నూతన యూజీసీ నూతన చట్టం ద్వారా కులవివక్షకు గురైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు న్యాయం జరిగేలా, నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందేనని పేర్కొన్నాయి.

అంతిమంగా యూనివర్సిటీల్లో సామాజిక న్యాయాన్ని పెంపొందిం చడానికి నూతన చట్టాలు తీసుకురావడమే కాకుండా, సుప్రీంకోర్టు, హైకోర్టులు, దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో జనాభా దామాషా ప్రకారం అన్ని కులాల వ్యక్తులు సమాన హక్కులు కల్పిస్తూ బలమైన చట్టా లు తీసుకురావలసిన బాధ్యత కేంద్రంపై ఉం ది. రాజ్యాధికారం, భూమి, వ్యాపారం.. ఇలా సమస్త రంగాల్లో అన్ని కులాలకు సమాన వాటా దక్కినప్పుడే భారత రాజ్యాంగ సంపూర్ణంగా అమలైనట్లని గ్రహించాలి.

 వ్యాసకర్త సెల్: 9553041549