14 June, 2026 | 4:18 PM

Breaking News

పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •  

అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానంకు స్పందన

14-06-2026 02:48 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయ ఆవరణలో శ్రీ అన్నపూర్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున కరీంనగర్, చొప్పదండి, సుల్తానాబాద్ వారి ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న ఆరవ నెల అన్నదాన కార్యక్రమానికి ఆదివారం అపూర్వ స్పందన లభించింది. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రతి నెల అమావాస్య రోజున ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సేవాసమితి వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని, ఆకలితో ఉన్న పేదలకు అన్నదానం చేయడంలో ఎంతో సంతోషంగా ఉంటుందని వారన్నారు, అన్నదానం కు మించిన దానం మరొకటి లేదన్నారు... ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అన్నపూర్ణ సేవా సమితి నిర్వాహకులను పలువురు అభినందించారు...