సూర్యాపేటలో ‘రెసోనెన్స్ ఫౌండేషన్’
సెంటర్‌ను ప్రారంభించిన మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ లక్ష్మీనా రాయణ తెలిపారు. దేశంలో ఐఐటీ-జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యాసంస్థలు సూర్యాపేటలో ఉన్న హోటల్ శ్రీ గ్రాండ్ వేదికగా ’రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సూర్యాపే టలో ఫౌండేషన్ కోచింగ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థలను అభినందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇంటర్ అనంతరం ఐఐటీ-జేఈఈ, నీట్ వంటి పోటీ ప్రవేశ పరీక్షలలో సులభంగా విజయం సాధించవచ్చని పేర్కొన్నారు’.
రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ.. ‘ఈ ఫౌండేషన్ సెంటర్ విద్యార్థులకు ప్రాథమికాంశాలను బలోపేతం చేసుకోవడానికి, ఐఐటీ-జేఈఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రారంభ దశలోనే ప్రిపరేషన్ మొదలుపెట్టడం, సంపూర్ణ అవగాహనతో కూడిన అభ్యాసం, కెరీర్ ఆధారిత విద్యా ప్రణాళిక ప్రాముఖ్యతను వివరించారు’.






