ఎప్‌సెట్‌లో రెజోనెన్స్ అద్భుత ఫలితాలు
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదివారం విడుదల చేసిన ఎప్‌ఎస్‌ట్ ఫలితాలలో వరంగల్ రెజోనెన్స్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని చైర్మన్ లెక్కల రాజిరెడ్డి వెల్లడించారు. డి. స్నితిక 753వ ర్యాంకు, సిహెచ్. భవనేశ్వరి 878, డి. సంజన 925, ఏ. రితిక 1982 ర్యాంకులు సాధించారు.
వీరితో పాటు 291 మంది విద్యార్థులు 10 వేల లోపు ర్యాంకులు సాధించి తెలంగాణ రాష్ట్రంలోని టాప్ 10 కళాశాలల్లో సీట్లు సాధించే అవకాశం ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్ధులను అభినందించారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో రెజోనెన్స్ డైరెక్టర్లు లెక్కల మహేందర్‌రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, సీఏవో లెక్కల రమ్య రాజిరెడ్డి, డీన్ బి.ఎస్. గోపాల్ రావు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






