18 May, 2026 | 1:45 AM

ఎస్‌ఆర్ అకాడమీకి ఉత్తమ ఫలితాలు

18-05-2026 12:51 AM

ఎప్‌సెట్‌లో విద్యార్థుల రాష్ట్రస్థాయి ర్యాంకులు

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ విద్యార్థులు ఎప్‌సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి, సత్తాచాటారు. వి.సాహ్యూ బీపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 14వ ర్యాంకుతో విజయపథాన్ని ఎగురవేశారు.

కే జీవన్ కు మార్ బీపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 91 వ ర్యాంకు, కే అష్రిత బీపీసీ విభాగంలో 262, ఆర్ శ్రావణి బీపీసీ విభాగంలో 298, జి యువన్ చంద్ర ఎంపీసీ విభాగంలో 299, జె శ్వేత 351, జె గురు మోహన్ చరణ్ 369, ఎన్ అవినాశ్ 408, ఎన్ శివకల్యాణి 413, పి సంజన 414, వై సాత్విక్ 476, ఆర్ నిరూప్‌రెడ్డి 515, కె జాహ్నవి 610, సీహెచ్ అర్ణవ్ 628, కె ధీరజ్ 654వ ర్యాంకులు సాధించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలకు ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వర దారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్‌రెడ్డి సంతోషాన్ని తెలియజేశారు. గత 50 సంవత్సరాలలో పటిష్టమైన ప్రణాళికలతో హై స్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీలలో విద్యనందిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో ర్యాంకులు సాధించారు.