7 July, 2026 | 6:21 PM

Breaking News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •   చనిపోయినా చిరంజీవే… ఆరుగురికి జీవం నింపిన ఏడేళ్ల యశ్వన్   •  

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

20-04-2026 02:20 AM

ఐఎన్‌టీయూసీ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ సంజీవ్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాం తి): ఆర్టీసీ కార్మికుల సమస్యలు, డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఐఎన్‌టీయూసీ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్ జీ సంజీవ్ రెడ్డి కోరారు. ఈ మేరకు జేఏసీ తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌కు లేఖరాశారు. ప్రభు త్వం వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించాలన్నారు.

2021 వేతన సవరణను అమలు చేయాలన్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించి, యూనియన్ ఎన్నికలను జరపాలని తెలిపారు. మహాలక్ష్మి స్కీమ్ రూ.400 కోట్ల నిధులను ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు. డ్రైవర్లపై అక్రమ కేసులను ఆర్టీసీ యాజమాన్యం తొలగించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల కారణంగా సిటీలో పనిచేసే డ్రైవర్ కండక్టర్లకు అదనపు సిబ్బందిగా చూపిస్తూ ఇతర రీజియన్‌లకు బదిలీ చేయడాన్ని మానుకోవాలని పేర్కొన్నారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెలించాలని కోరారు.