15 June, 2026 | 2:20 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

పరిశుభ్రమైన ఆహారం అందించాలని వినతి

04-02-2026 12:00 AM

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 3: మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థులకు ఆహారంలో అంబర్ ప్యాకెట్ గుట్కా రావడాన్ని ఖండిస్తూ.. మంగళవారం బిఆర్‌ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున ముదిరాజ్ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంజియూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ కి అందజేశారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ యూనివర్సిటీ ఏర్పడిన నుండి పలు సమస్యలతో తాండవిల్లుతోంది అని ఈ రెండు సంవత్సరాల కాలంలో యూనివర్సిటీ హాస్టల్లో కలుషిత ఆహారం రావడం ఇది 6వ సారి అని తెలిపారు.

విద్యార్థుల భోజనం అనేకసార్లు కలుషితం కావడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. కలుషిత ఆహార సంఘటనలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీసీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అలాగే యూనివర్సిటీ కళాశాలలో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం జి యూనివర్సిటీ నాయకులు గాదె శివ, చలకాని పరమేష్, కన్నబోయిన వంశీ, దాసరి మచ్చ గిరి, రాంబాబు, మహేష్, సైదులు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.