జన గణన విధుల కేటాయింపులో పారదర్శకత పాటించాలని వినతి
25-03-2026 08:04 PM
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం (టీఎస్ యుటిఎఫ్) చిట్యాల మండల శాఖ ఆధ్వర్యంలో జనగణన–2027 పనుల సందర్భంలో ఉపాధ్యాయులకు విధుల కేటాయింపులో పారదర్శకత పాటించాలని మండల తహసీల్దార్ విజయకి బుధవారం వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు అధ్యక్ష కార్యదర్శులు శేషమల్ల నాగయ్య, గడగోజు సతీష్ మాట్లాడుతూ... జనగణన వంటి కీలక ప్రభుత్వ కార్యక్రమాలలో ఉపాధ్యాయుల విధుల కేటాయింపు పూర్తిగా నిబంధనల మేరకు, సీనియార్టీ ఆధారంగా చేయాలని కోరారు. ఎలాంటి అక్రమాలు, పక్షపాతం లేకుండా సమానత్వంతో బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పారదర్శక విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.




