రైతులను ప్రజలను మోసం చేసిన సర్కార్
25-03-2026 07:58 PM
కుబీర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారులు ఉన్న ప్రజా పాలన ప్రభుత్వం రైతులను ప్రజలను మోసం చేసిందని ఆయన బిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త డా. కిరణ్ కొమ్రెవర్ దజమెత్తారుమెత్తారు. బుధవారం కుభీర్ మండలంలోని చాత, పార్డి-B రైతుల పోరుబాట నిర్వహించారు. రైతులకు హామీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ కొందరికి వర్తించిందని ఇప్పుడు పంటసాయం ఎకరానికి మాత్రమే వేశారని ఆరోపించారు. రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు ఇవ్వలేని ప్రభుత్వం కొనుగోలు కూడా చేపట్టకుండా నష్టం చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు తీయడం లేదని పేర్కొన్నారు అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.




