సీఎంసీ ప్రజావాణికి 47 వినతులు
అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి 38..
శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రజలతో నేరుగా ముఖాముఖి అయ్యారు. పౌరులు తమ సమస్యలను వ్యక్తం చేస్తే వాటిని విని, సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 47 వినతులు నమోదయ్యాయి. వాటిలో టౌన్ ప్లానింగ్ శాఖకు 38, ఇంజినీరింగ్కు 6, ల్యాండ్ అక్విజిషన్కు ఒకటి, శానిటేషన్కు ఒకటి, అర్బన్ బయోడైవర్సిటీకి ఒకటి చొప్పున వచ్చాయి.
ప్రతి వినతికి ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ కేటాయించడంతో పాటు, ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా పౌరులు తమ అభ్యర్థన స్థితిని, పురోగతిని సులభంగా పర్యవేక్షించుకునే అవకాశం కల్పించారు. సంబంధిత శాఖలు ఈ వినతులను వివరంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని కమిషనర్ స్పష్టం చేశారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సోమవారం ఈ విధంగా ప్రజావాణి నిర్వహిస్తూ పౌరులతో నేరుగా అనుసంధానం కొనసాగిస్తోంది.






