25 July, 2026 | 1:52 AM

సింగరేణి సమస్యలు తీర్చాలని డిప్యూటీ సీఎంకు వినతి

25-07-2026 12:00 AM

సత్తుపల్లి, జూలై24 ( విజయక్రాంతి): ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, మినిమం వేజెస్ చైర్మన్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు,తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క కి స్థానిక శాసనసభ్యురాలు డా. మట్టా రాగమయి దయానంద్  ద్వారా ఐ.ఎన్.టీ.యూ.సీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు సత్తుపల్లి ఏరియా అభివృద్ధి, సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థ బలోపేతానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సిం గరేణి కార్మికుల తరఫున క్రింది ప్రధాన డిమాండ్లను, సమస్యలతో కూడిన వినతిపత్రంలో గల ప్రధాన డిమాండ్లు తాడిచెర్ల బ్లా క్-2ను సింగరేణికి కేటాయించిన విధంగానే సత్తుపల్లి ఓసీ-3 బ్లాక్ను కూడా సింగరేణి సం స్థకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలి, జే వీఆర్ సీహెచ్పీలో ప్రస్తుతం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఏనార్గో కంపెనీ కాలపరిమితి ముగియనున్నందున, గతంలో మాదిరిగానే ఆ యూనిట్ను పూర్తిగా సింగరేణి కార్మికులతోనే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలి,

సత్తుపల్లి 12వ ఏరియాగా ఏర్పడినప్పటికీ ఇప్పటివరకు అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. సెక్యూరిటీ, పర్సన ల్, ఫైనాన్స్ తదితర అన్ని విభాగాలతో పాటు అవసరమైన పూర్తి స్థాయి కార్యాలయ సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకోవాలి అని,ప్రస్తుతం ఉన్న సత్తుపల్లి డిస్పెన్సరీని పూర్తి స్థాయి ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి అని,సత్తుపల్లి ఏరియాకు అవసరమైన ఏరియా ఏర్పాటు చేసి నిర్వహణ పనులు సమర్థవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి.

పై సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి, వీలైనంత త్వరగా పరిష్కరించి సత్తుపల్లి ఏరియా అభివృద్ధికి తోడ్పడాలని ఐఎన్టీయూసీ నాయకులు ఉప ముఖ్యమంత్రిని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో బ్రాంచ్ సెక్రటరీ మురళీకృష్ణ, బ్రాంచ్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షట్రక్ బాబు, పిట్ సెక్రటరీలు సీతారామరాజు,నగేష్,షణ్ముఖ చారి, శ్రీధర్, ఇక్బాల్, ఐవీ రెడ్డి, సందీప్, దాసరి శ్రీనివాస్, చెరుకు రాజు, సుభాని, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.