2 July, 2026 | 12:24 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం దారుణం

03-02-2026 12:16 AM

గరిడేపల్లి, ఫిబ్రవరి 2: బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో అహింసా పద్ధతిలో కొట్లాడి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించడం దారుణమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం జరిగిన సిపిఐ పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును తొలగించి కొత్తగా జీ రామ్ జీ పేరు పెట్టడం సిగ్గుచేటన్నారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత,గత ప్రభుత్వాలు, ప్రభుత్వ పథకాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టి గౌరవించడం జరిగిందని, ఈ ప్రభుత్వం అట్టి పేర్లన్నీ తొలగించి,బిజెపి ప్రభుత్వం తన కిష్టమైన పేర్లను పెట్టి ఆనంద పడుతోందన్నారు.

పథకాలకు పేర్లను తొలగించినంత మాత్రాన వారి స్థాయి పడిపోదని,ప్రజల మనసులలో వారు చిరస్థాయిగా నిలిచిపోతారని దానిని బిజెపి ప్రభుత్వం గ్రహించాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం ఎత్తివేసినా, పేరు మార్చిన ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య,సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు త్రిపురం సుధాకర్ రెడ్డి,ఎడ్ల అంజిరెడ్డి,కుందూరు వెంకటరెడ్డి,పోకల ఆంజనేయులు,పంగ గోవిందు,చెవ్వ ఎంకన్న,షేక్ నబి సాహెబ్,ప్రధాని సైదులు తదితరులు పాల్గొన్నారు.