గడ్కరీ డీప్‌ఫేక్ పోస్టులు తొలగించండి
మెటా, ఎక్స్‌కు బొంబాయి హైకోర్టు ఆదేశం
ముంబై, ఆగస్టు 5: కేంద్ర పెట్రోలియం, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి చెందిన ఆన్‌లైన్ డీప్ ఫేక్ వీడియోలు, పోస్టులను వెంటనే తొలగించాలని, ఆన్‌లైన్‌లో నీచమైన కంటెంట్‌కు చోటు ఉండకూడదని, వాటిని పోస్టు చేసిన వారి వివరాలను అందజేయాలని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు మెటా, ఎక్స్‌లను బొంబాయి హైకోర్టు ఆదేశించింది. ఈ రకమైన కంటెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇౄ డీప్ ఫేక్ వీడియోలపై బొంబాయి హైకోర్టును నితీన్ గడ్కరీ ఆశ్రయించి, తన పరువుకు భంగం కలిగించినందుకు గాను రూ. 11 కోట్ల నష్టపరిహారాన్ని కోరారు.
బుధవారం ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇంధన వివాదంతో కేంద్రమంత్రి, కుటుంబాన్ని ముడిపెడుతున్న ఏఐ వీడియోలు, పోస్టులను వెంటనే ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆదేశించింది. బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా ఇటువంటి కంటెంట్‌ను, పోస్టులను తొలగించే మార్గం, యంత్రాంగం ఏదైనా ఉందా? అని ఈ ప్లాట్‌ఫామ్‌లను ప్రశ్నించింది.






