6 August, 2026 | 2:40 AM

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహనా సదస్సు

06-08-2026 01:40 AM

కోదాడ ఆగస్టు 5: కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాల పై బుధవారం అవగాహనా సదస్సు  నిర్వహించడం జరిగినదని కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ శ్రీనివాస రెడ్డి పాల్గొని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్ళు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ మరియు కంప్యూటర్స్ ఉపయోగించి విద్యార్థినులను మోసం చేసి, వారి వ్యక్తి గత సమాచారాన్ని దొంగిలించటం జరుగుతుంది అని, సైబర్ నేరాలపై విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని తెలియచేసారు.

కోదాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. శివ శంకర్ మాట్లాడుతూ విద్యార్థి నులు సామాజిక మాధ్యమాలైన పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సప్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థినులకు  సూచించారు. కోదాడ ట్రాఫిక్ సబ్ -ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మరియు ప్రాణాలను రక్షించడానికి ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు.  డ్రైవింగ్ చేసేటప్పుడు చరవానిలను  వినియోగించ కూడదని విద్యార్థి నులకు చూచించారు. 

కోదాడ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ - జి. అజయ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థినులు, నకిలీ సోషల్ మీడియా ప్రొ ఫైల్ తో, విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుందని, అటువంటి నకిలీ ఖా తాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక పోలీస్ అక్క లీనా మాట్లాడుతూ, విద్యార్థినులు రక్షణ చట్టాలపై అవగాహనా కల్పించుకోవాలని, విద్యార్థినులకు ఇటువంటి సమస్యలు ఎదురైనా పోలీస్ అక్కను సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.