స్టేడియం నుంచి నీటి తొలగింపు
01-07-2026 01:48 AM
మహబూబాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): చెరువుగా మారిన స్టేడియం! క్రీడాకారులకు, వాకర్స్ కు తిప్పలు పేరుతో విజయక్రాంతి దినపత్రికలో మంగళవారం ప్రచురించిన వార్తా కథనానికి మహబూబాబాద్ మున్సిపల్ అధికారులు,సిబ్బంది స్పందించారు. జిల్లా కేంద్రంలోని ఎ న్టీఆర్ స్టేడియంలో నిలిచిన వర్షపు నీటిని బయటకు తొలగించేందుకు జేసిబీ తో తాత్కాలికంగా కాలువ తీయించారు.
స్టేడియంలో నిలిచిన వరద నీటిని బయటకు పంపించారు. దీనితో క్రీడాకారులకు, వాకర్స్ కు తాత్కాలిక ఉపశమనం కలిగింది. అయితే స్టేడియం పూర్తిగా లెవెలింగ్ చే యించి, వరద నీరు నిలవకుండా పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.






