ఆయిల్‌పామ్ సాగు రైతులకు ఎంతో మేలు
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిర్మల్ జూన్ 30 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రైతులు సాగు విధానంలో మార్పులు తీసుకొచ్చి ఆయిల్ ఫామ్ పంటలు సాగుచేస్తే లాభాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లాలో రైతులు సాగు చేసుకుంటున్నా ఆయిల్ ఫామ్ తోటలను సందర్శించి సాగు విధానం రైతులకు కలుగుతున్న ప్రయోజనాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లాలో 8 ఎకరాలు ఈ పంట సాగుతుందని మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులకు ఆదాయం కలిసి వస్తుంది అన్నారు. రైతులకు అన్ని విధాల కోసం అందించాలని ఉద్యానవన శాఖ అధికారి రమణను కోరారు.
నిర్మల్ జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం పరిశీలించారు. లోకేశ్వరం దిల్వార్పూర్ నర్సాపూర్ దగ్గర ప్రాంతాల్లో పరిశీలించిన ఆయన పక్కగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ ఉద్యానవన శాఖ అధికారి రమణ తదితరులు ఉన్నారు






