కైతలాపూర్‌లో ఆక్రమణల తొలగింపు
27-05-2026 12:00 AM
కూకట్‌పల్లి, మే 26 (విజయక్రాంతి): కూకట్‌పల్లి మండలం కైతలాపూర్‌లో రహదారిపై అక్రమంగా నిర్మించిన షెడ్‌లను హైడ్రా సిబ్బంది మంగళవారం కూల్చివేశారు. కైతలాపూర్‌లోని జెవెల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ నిర్వాహకులు 1700ల గజాల రహదారి స్థలాన్ని కబ్జా చేసి కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. ఈ నిర్మాణంపై స్థానికులు సంబంధిత అధికారులతో పాటు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణమని నిర్ధారించుకున్న అనంతరం నిర్మాణ సంస్థ నిర్మించిన ఆఫీస్‌రూమ్‌తో పాటు వెనుక వైపు నిర్మించిన పశువుల షెడ్‌ను సైతం తొలగించారు.






