27 May, 2026 | 3:24 AM

పోలీస్ కస్టడీకి బండి భగీరథ్

27-05-2026 12:00 AM

మూడు రోజుల విచారణకు మేడ్చల్ జిల్లా కోర్టు అనుమతి

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను విచారించేందుకు మేడ్చల్ జిల్లా కోర్టు అనుమతిచ్చింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో భగీరథ్‌ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం కోర్టు విచారణ జరిపింది. మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే తీవ్ర ఆరోపణలపై బండి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు పోలీసులు భగీరథ్‌ను విచారించనున్నారు.