21 April, 2026 | 2:30 AM

వాహనం దూకి రిమాండ్ ఖైదీ పరార్

21-04-2026 01:00 AM
  1. బోయిన్‌పల్లి పోలీసులు కళ్ళుగప్పు పరారైన నిందితుడు
  2. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా?
  3. అధికారులు, సిబ్బంది ఖైదీ సురేష్‌కి సహకరించారా?

సికింద్రాబాద్,ఏప్రిల్ 20 (విజయక్రాంతి): చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురిని మరో కేసులో పీటీ వారె్ంప బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు విచారణ కోసం తరలించిన పోలీసులు.విచారణ అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్తుం డగా ఒక చోట ట్రాఫిక్ లో వాహనం ఆగిన సమయం చూసి రెప్పపాటులో వాహనం దిగి పరారైన ఖైదీ.

రిమాండ్ ఖైదీలను పోలీస్ వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో తీసుకొస్తుండ గా ఈఘటన జరిగింది.చంచలగూడ జైలు సమీపంలోనే వాహనం నుంచి దూకి పరారైనట్లు సమాచారం.పరారైన నిందితుడు నరేష్గా గుర్తింపు. మిగతా ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు.

ఈ నెల 12న ముగ్గురు దొంగలను రిమాండ్కు పంపిన పోలీసులు పరారైన నరేష్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం గా వ్యవహరించారా, లేక ఎవరైనా పరారైన ఖైదీకి సహకరించారా అనే కోణంలో విచారణ జరుపుతున్న పోలీస్ అధికారులు.