కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వ అమృత్ 2.0 పథకంలో 5.82 లక్షల నిధులతో చెరువుల సుంధరీకరణ పనులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు.
నగరంలోని 2 వ డివిజన్ పరిదిలో గల తీగలగుట్టపల్లి, కొత్తపల్లి చెరువులను సంధర్శించి...నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ నరెంధర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులతో కలిసి అమృత్ 2.0 పథకంలో 1.21 కోట్ల నిధులతో తీగలగుట్టపల్లి మాలకుంట చెరువు, 2.86 కోట్ల నిధులతో కొత్తపల్లి ఊర చెరువుల సుంధరీకరణ పనులను భూమీ పూజ చేశారు. ఈ సంధర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.... నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే పర్యటక ప్రాంతాలుగా చెరువులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. నగరానికి ఆనుకోని ఉన్న మూడు చెరువులను సుంధరీకరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నుండి 5.82 లక్షల నిధులను విడుదల చేశామన్నారు.
గతంలో తీగలగుట్టపల్లి, కొత్తపల్లి చెరువుల వద్ద వినాయక, బతుకమ్మ నిమజ్జనాలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా... వీటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక నిధులను విడుదల చేశామన్నారు. చెరువుల సుంధరీకరణ పనుల్లో ప్రజలకు అవసరమైన ఘాట్స్ నిర్మాణం, చెరువు కట్ట విస్తరణ తో పాటు బలంగా చేయడం, స్టోన్ స్టిచ్చింగ్, సీవరేజ్ వాటర్ కలవకుండా డ్రైనేజీల డైవర్షన్, ప్రొటక్షన్ వాల్, రేలింగ్, చక్కటి లైటింగ్, గ్రీనరీ, అందమైన పూల మొక్కలను ఏర్పాటు చేసి.. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు.
నగర ప్రజలు కుటుంబ సమేతంగా ఈ ప్రాంతాలకు వచ్చి సేదతీరే విధంగా అన్ని రకలా వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మూడు చెరువులను అభివృద్ధి చేసి కరీంనగర్ నగరాన్ని పర్యటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధే లక్ష్యంగా మేము మా పాలకవర్గం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






