29 August, 2026 | 12:22 AM

బస్ స్టేషన్ లో రద్దీని పర్యవేక్షించిన రీజనల్ మేనేజర్

28-08-2026 10:09 PM

ముకరంపుర,(విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి.రాజు డిప్యూటీ రీజనల్ మేనేజర్ భూపతి రెడ్డితో కలిసి కరీంనగర్ బస్ స్టేషన్ లో ఉండి అన్ని రూట్లలో ప్రయాణికుల రద్దీని, బస్సుల అందుబాటును పర్యవేక్షించారు. ఈ క్రమంలో కరీంనగర్ ఒకటవ రెండవ సందర్శించి ప్రయాణికుల సౌకర్యార్థం డిపోలోని అన్ని బస్సులను నడపాలని, బస్ స్టేషన్ లో ఉండి ట్రాఫిక్ క్లియరెన్స్ ను పర్యవేక్షించాలని డిపో మేనేజర్ విజయ మాధురి ఒకటవ రెండవ డిపోలకు సూచించారు. రీజనల్ మేనేజర్ తో పాటు జోన్ సెక్యూరిటీ అధికారి భాస్కరరావు ఉన్నారు.