28 August, 2026 | 11:58 PM

కులమతాలకు అతీతంగా రక్షాబంధన్ వేడుకలు

28-08-2026 10:50 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో శుక్రవారం కులమతాలకు అతీతంగా, సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ పాషాకు కాలనీ వాసులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ... పరస్పర ప్రేమ, సోదరభావం, హిందూ ముస్లిం కుల మతాలు ఒక్కటే అని చాటి చెప్పేందుకే ఈ రక్షాబంధన్ వేడుకలను జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ పండుగ అందరి పండుగ అని ఆడపడుచుల ఆశీర్వాదం దీవెనలు ఎప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు మహిళలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.