6 May, 2026 | 6:33 PM

మర్రి అశోక్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రేగా కాంతారావు

06-05-2026 05:51 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో ఇటీవల మర్రి అశోక్ రెడ్డి సతీమణి అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో బుధవారం వారి కుటుంబాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలియజేసి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్పు చెప్పారు. కుటుంబానికి తనవంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.