10 March, 2026 | 3:31 AM

ఎన్నికల్లో సంస్కరణలు తేవాలి

10-03-2026 01:25 AM

తెలంగాణ రాజకీయ కూటమి

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయ కూటమికి చెందిన 9 మంది సభ్యుల రాజకీయ పార్టీల ప్రతినిధు లు ప్రధాన ఎన్నికల అధికారిని సోమవారం కలిసి వివిధ ఎన్నికల సంస్కరణల కోసం వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాజకీయ కూటమి కోరిన 17 ఎన్నికల సంస్కరణ లలో, ముఖ్యమైన కొన్ని సూచనలు క్రింది విధంగా ఉన్నాయి. నమోదైన రాజకీయ పా ర్టీలకు కేటాయించిన కామన్ సింబల్స్ కూ డా అధికారిక వ్బుసైట్లో ప్రదర్శించాలి.

ఏ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలంటే, ఆ అభ్యర్థికి బీఫామ్ ఇచ్చిన రాజకీ య పార్టీ అనుమతి తప్పనిసరి చేయాలి, ఎన్నికల ఖర్చు మొత్తాన్ని ఎన్నికల సంఘమే భరించాలి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎ మ్మెల్యే ఎన్నికలకు రూ.40 లక్షలు, ఎంపీ ఎన్నికలకు రూ.70 లక్షల ఖర్చు పరిమితి ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా లేదు, పోటీ చేసే అభ్యర్థికి ఓటర్ ఎపిక్ ఎక్స్ట్రాక్ట్ కాపీ సరిపోతుంది, అతను మరో నియోజకవర్గానికి చెందినవాడైతే అదనపు ఓటర్ ఎక్స్ట్రాక్ట్ తప్పనిసరి చేయకూడదు, ప్రస్తుతం రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్‌ను తిరస్కరించిన తర్వాత అప్పీల్ చేసే అవకాశం లేదు.

దీనికి ఒక సరైన అప్పీల్ విధానం ఉండాలి. ఒక అభ్యర్థి గరిష్టంగా రెండు సార్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయాలంటే క్రిమి లేయర్ విధానం ప్రవేశపెట్టాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస న్యాయ పరిజ్ఞానం, విద్యార్హత (ఉ దాహరణకు డిగ్రీ వంటి అర్హత) ఉండేలా ని బంధనలు పెట్టాలని కోరారు.