విమాన సర్వీసుల తగ్గింపు
28-05-2026 01:01 AM
న్యూ ఢిల్లీ, మే 27: టాటా గ్రూప్ విమానయాన సంస్థ ఏయిర్ ఇండియా 800 దేశీయ విమాన సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించింది. జూన్ నుంచి 2026 ఆగస్ట్ మధ్య ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురానుంది. పెరుగుతున్న జెట్ ఇంధన ధరల కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
అటు ఇండిగో సంస్థ కూడా తన దేశీయ విమాన సర్వీసులను 5 నుంచి 7 శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఏయిర్ ఇండియా వారానికి 4,400 విమాన సర్వీసులను నడుపుతోంది. వీటిలో 3,600 దేశీయ సర్వీసులు కాగా, 800 అంతర్జాతీయ సర్వీసులున్నాయి. దేశీయ సర్వీసులను 22 శాతం తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇంధన వ్యయాలు పెరగ డమే నిర్ణయానికి కారణంగా ప్రకటించింది.






