ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు
04-03-2026 01:00 AM
మేడ్చల్ అర్బన్, మార్చి 3(విజయక్రాంతి): మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బోయిన్పల్లి లోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హోలీ పండుగను అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి ని కలిసిన వారిలో దయానంద యాదవ్, జిల్లా గ్రంథా లయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, సుదర్శన్, రమేష్, శ్రీను, వెంకటేష్ తదితరులున్నారు.




