ఉపాధి హామీలో రికార్డు స్థాయి కూలీలు
గట్లమల్యాల సిబ్బందికి అధికారుల ప్రశంసలు, నగదు బహుమతి
నంగునూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని గట్లమల్యాలలో ఉపాధి హామీ పథకంలో,క్షేత్రస్థాయిలో సిబ్బంది చేసిన కృషి ఫలితంగా బుధవారం 207 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు.పెద్ద సంఖ్యలో కూలీలను సమీకరించి, వారికి ఉపాధి కల్పించిన తీరును జిల్లా అధికారుల బృందం ప్రత్యేకంగా అభినందించింది.
అదనపు డీఆర్‌డీఓ శ్రీనివాస్ గౌడ్ గ్రామాన్ని సందర్శించి,పంచాయతీ కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్,నిర్వాహకులు బి. రవీందర్,జి. రాజు లను ప్రశంసించి గట్లమల్యాల మేట్‌కు రూ. 1000 నగదు ప్రోత్సాహకాన్ని ఎంపిడిఓ మహబూబ్ అలీ తో కలసి ఆయన అందించారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులైన కూలీలందరికీ పని కల్పించడంలో బృందం చూపిన చొరవ ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.






