22 April, 2026 | 9:00 PM

గంజాయితో పట్టుబడ్డ యువకుడిపై కేసు నమోదు

22-04-2026 07:26 PM

ధర్మపురి,(విజయక్రాంతి): ధర్మపురిలో గంజాయితో యువకుడు బుధవారం పట్టుబడ్డాడు. ఎస్సై జి. మహేష్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండల కేంద్రానికి చెందిన ఈసారపు ప్రణీత్ కుమార్(25) అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుండి గంజాయి తాగడానికి అలవాటు పడినాడు. అదే విదంగా గంజాయి తీసుకుని ధర్మపురి ప్రాంతంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు దగ్గర ఉన్న సమయంలో ముందస్తు సమాచారం మేరకు తమ పోలీస్ సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు.

పట్టుబడిన వ్యక్తిని విచారించగా అతడి దగ్గర 60 గ్రాముల నిషేధిత గంజాయి దొరికినట్లు పేర్కొన్నారు. అట్టి గంజాయిని స్వాధీన పరచుకుని కేసు నమోదు చేసి ఇద్దరు పంచుల సమక్షంలో  సీజ్ చేశామన్నారు. మాదకద్రవ్యాలు సేవించిన లేదా విక్రయిస్తూ పట్టుబడిన ఉపేక్షించేది లేదని,కఠిన శిక్షలు అమలయ్యేలా కేసులు చేస్తామని హెచ్చరించారు. గంజాయిని అరికట్టడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని ఈ సందర్బంగా ఎస్సై మహేష్ తెలిపారు.