7 July, 2026 | 7:30 PM

Breaking News

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •   ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు   •  

పనిచేసే వారికి గుర్తింపు, పదవులు

12-03-2026 01:10 AM
  1. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి 

ఎమ్మెల్సీ దండే విఠల్ పిలుపు

బెజ్జూర్, మార్చి 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అభివృద్ధే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. బెజ్జూర్ మం డల కేంద్రంలో నిర్వహించిన మండల కాం గ్రెస్ అధ్యక్ష పదవులకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా దండే విఠల్ మాట్లాడుతూ పార్టీలో కొత్తపాత అనే భేదాలు లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

పార్టీలో పదవులు వస్తుంటాయని, పోతుంటాయని, పదవి వచ్చినవారు పొంగిపోకుండా, రానివారు నిరు త్సాహపడకుండా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిదని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. గ్రూప్ రాజకీయాలకు తావులేకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కలిసి కట్టుగా పని చేయాలని అన్నారు.

పనిచేసే వారికి పార్టీ తగిన గుర్తింపు, పదవులు ఇస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ గణపతి, సిర్పూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వర్ధన్, మాజీ జెడ్పీటీసీ పంద్రం పుష్పలత, సర్పంచులు చండే పద్మ, రాంప్రసాద్, కొడప శంకర్, సోయం చిన్న య్య, ఉపసర్పంచ్ రాచకొండ ఆదర్శ్, నాయకులు అర్షద్ హుస్సేన్, కొండ్ర జగ్గా గౌడ్, విశ్వేశ్వర్, భూషణ్ శంకర్ పాల్గొన్నారు.