2 September, 2026 | 8:35 PM

Breaking News

రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •  

ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్

02-09-2026 | 07:37pm

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కదం తొక్కిన గులాబీ సైనికులు

 తుంగతుర్తి,(విజయ క్రాంతి): ప్రజల్లో చైతన్యం పెరిగి తిరుగుబాటు మొదలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఖబర్దార్ అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్(Kishore Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వైఫల్య పాలనపై తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 మోసపూరిత హామీలతో రూపొందించిన 420 మీటర్ల ఫ్లెక్సీ తో వినూత్న రీతిలో ర్యాలీ చేసి,, కాంగ్రెస్ బాకీ కార్డ్ లను పంపిణీ చేసి, నిరసన తెలిపారు

తుంగతుర్తి లోని పార్టీ కార్యాలయo నుండి మొదలైన ర్యాలీ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మరో ఆఫీస్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి ప్రధాన కూడలి వరకు 4 కిలోమీటర్ల మేరా గులాబి దండు కదిలింది. తాను పదేళ్ల ఎమ్మెల్యే(MLA) కాలంలో రూ.10 లక్షల ఇసుక మాఫియా చేసినట్లు రుజువు చేపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అన్నారు.  రాష్ట్రంలో పైన ఒక గుంపు మేస్త్రి కింద ఒక మేస్త్రి పాలన చేస్తున్నారు అని పేర్కొన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది..రేవంత్ రెడ్డి( Revanth Reddy) ) చరిత్రలో చెత్త సీఎంగా మిగిలిపోతాడు అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కాలి గోటికీ కూడా సరిపోని రేవంత్ రెడ్డి అడ్డగోలిగా మాట్లాడుతున్నాడు... ఖబడ్దార్ రేవంత్ రెడ్డి( Revanth Reddy) ) కేసీఆర్(KCR) గురించి మాట్లాడితే నాలుక చిరిస్తాం అని హెచ్చరించారు. 420 హామీలతో గద్దె నెక్కిన పక్క 420 పార్టీ కాంగ్రెస్ పార్టీ.... ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అని విమర్శించారు. సాగర్ నీళ్లు ఆంధ్రోళ్లు దోచుకొని పోతుంటే నోరు మెదపని దద్దమ్మ 

 నీళ్ల దొంగ చంద్రబాబు, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందంలో భాగంగానే సాగర్ నీళ్లు దోచుకొని పోతున్నారు..ఆంద్రకు తరలిస్తున్నారు.. మన రైతులను ఎండబెట్టి ఆంధ్రోళ్లకు చద్ది కడుతున్న నిచపు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ జపం లేకుండా ఏసభలో కూడా వెయ్యి రోజుల పాలన చేయని ముఖ్యమంత్రి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీచిర్పెర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహ రెడ్డి,  పార్టీ మండల పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్ల, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు,  విద్యార్థి,  పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, పాల్గొన్నారు.