ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కరించాలని డిఎంహెచ్వోకు వినతిపత్రం
02-09-2026 | 07:29pm
తుంగతుర్తి( విజయ క్రాంతి): ఆశ కార్యకర్తల( ASHA workers) సమస్యల పరిష్కరించాలని కోరుతూ బుధవారం డిఎంహెచ్ఓ(DMHO) డాక్టర్ వెంకటరమణకు సూర్యాపేట కార్యాలయంలో తుంగతుర్తి మండల ఆశా కార్యకర్తలు వినతి పత్రం అందించి, అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆశ కార్యకర్తల సంఘం మండల అధ్యక్షురాలు మేకల జయమ్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తాము కష్టాలు చవితిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి, కోటి రూపాయల ఇన్సూరెన్స్ ను ప్రభుత్వం నుంచి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు






