9 June, 2026 | 2:45 AM

రియల్ యూకే ఆపర్చునిటీస్

09-06-2026 12:00 AM

11న సుల్తాన్ -ఉల్ -ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నిసాయూ యూకే కార్యక్రమం

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): విదేశీ విద్యా రంగంలో ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిసాయూ యూకే 2026 రియల్ యూకే ఆపర్చునిటీస్ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్ పంజాగుట్ట కార్పొరేట్ కార్యాలయంలో విడుదల చేశారు.  గ్లోబల్ ట్రీ, నే షనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలు మ్ని యూనియన్ యూకే (నిసాయూ యూ కే) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ఈ మెగా ఎడ్యుకేషన్ ఈవెంట్ జూన్ 11న బం జారాహిల్స్‌లోని సుల్తాన్ -ఉల్ -ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జరగనుంది. గ్లోబల్ ట్రీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ అలపాటి శ్రీకర్ మాట్లాడుతూ.. విదేశీ విద్యపై ఆసక్తి కలిగిన భారతీయ విద్యార్థులకు ప్రా మాణిక సమాచారం అందించడం, యూకే విద్యా రంగ ప్రతినిధులతో ప్రత్యక్షంగా మ మేకమయ్యే అవకాశాలు కల్పించడం అత్యం త ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ట్రీ కంట్రీ హెడ్ నమ్రత గోటి, బ్రాం చ్ హెడ్ కృష్ణ సుధీర్ కూడా పాల్గొని కార్యక్రమ విశేషాలను విద్యార్థులు,

బృంద సభ్యు లతో పంచుకున్నారు. నిసాయూ యూకే వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ సనం అరోరా, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్, యునైటెడ్ కింగ్డమ్ మాజీ పార్లమెం ట్ సభ్యుడు వీరేంద్ర కుమార్ శర్మ పాల్గొని యూకేలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు, కెరీర్ అభివృద్ధి అంశాలపై విలువైన సూచనలు అందించనున్నారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, యూ నివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్,

యూనివర్సిటీ ఆఫ్ సర్రే, కోవెంట్రీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్, ఆస్టన్ యూనివర్సిటీ, క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్, రాయల్ హా లోవే యూనివర్సిటీ ఆఫ్ లండన్, రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ సహా 30కి పైగా ప్రముఖ యూకే విశ్వవిద్యాలయాలు పాల్గొననున్నా యి. అర్హులైన విద్యార్థులు రూ.2.5 లక్షల వరకు గ్లోబల్ ట్రీ స్కాలర్షిప్ పొందే అవకాశంతో పాటు, రూ.8 లక్షల వరకు యూనివ ర్సిటీ స్కాలర్షిప్ వివరాలు తెలుసుకోవచ్చు. అర్హతలు కలిగిన విద్యార్థులకు కొన్ని విశ్వవిద్యాలయాలు స్పాట్ అడ్మిషన్ ఆఫర్ లెటర్ల ను అందిస్తాయి. యూకేలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరా రు. నమోదు, వివరాల కోసం 82972 49724 నంబరులో సంప్రదించవచ్చు.